కరీంనగర్ జిల్లా గన్నేరువరం పోలీస్ స్టేషన్ లో ఊహించని ఘటన. 2026, ఏప్రిల్ 27వ తేదీ ఉదయం.. పోలీస్ స్టేషన్ లోకి ఓ పెద్ద నాగు పాము వచ్చింది. పోలీస్ స్టేషన్ లో తన గదిలో ఉన్న ఎస్ఐ నరేంద్ రెడ్డి... తన కుర్చీలో కూర్చుని పోలీస్ స్టేషన్ కు వచ్చిన వాళ్లతో మాట్లాడుతున్నాడు. సరిగ్గా ఇదే సమయంలో.. ఎస్సై కుర్చీ వెనక ఉన్న కిటికీ నుంచి ఓ పెద్ద నాగుపాము లోపలికి వచ్చింది.
కిటికిలో నుంచి లోపటికి వచ్చిన నాగు పాము.. ఎస్సై నరేంద్ రెడ్డి భుజనంపై ఎక్కే ప్రయత్నం చేస్తుంది. ఈ విషయాన్ని ఎదురుగా కూర్చున్న వ్యక్తి గమనించి.. పాము పాము సార్ అంటూ కేకలు వేశాడు. వెంటనే అప్రమత్తం అయిన ఎస్సై నరేంద్ రెడ్డి.. తన కుర్చీ నుంచి ఒక్కసారిగా లేచి బయటకు వచ్చేశాడు. ఈ ఘటనతో పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తం షాక్ అయ్యారు. ఆందోళన చెందారు.
ALSO READ : 24 గంటల్లో అన్ని పెట్రోల్ బంకులు ఓపెన్ అవుతాయి
పాము పోలీస్ స్టేషన్ లోనే ఉండటంతో.. గ్రామంలో పాములు పట్టే వ్యక్తి పోచయ్యను పిలించారు. ఆయన వచ్చిన ఎస్సై గదిలో ఉన్న నాగు పామును పట్టుకుని బయటకు తీసుకొచ్చాడు. పోలీస్ స్టేషన్ బయటకు నాగు పామును కట్టి చంపారు. దీంతో పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది అంతా ఊపిరిపీల్చుకున్నారు. పాము వచ్చిన సమయంలో ఎస్సై వెంటనే స్పందించటం పాము కాటు నుంచి తృటిలో తప్పించుకున్నట్లు చెబుతున్నారు గ్రామస్తులు.

