
సాంటియాగో (చిలీ): జూనియర్ విమెన్స్ హాకీ వరల్డ్ కప్‌లో నాకౌట్ చేరలేకపోయిన ఇండియా క్లాసిఫికేషన్ మ్యాచ్‌ల్లో ఆకట్టుకుంటోంది. 9–12 స్థానాల కోసం శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా 3–1తో కొరియాను ఓడించింది. రోప్ని కుమారి (23వ ని.), ముంతాజ్ ఖాన్ (44వ ని.), అన్నూ (46వ ని.) ఇండియాకు గోల్స్ అందించగా, జియున్ చోయ్ (19వ ని.) కొరియా తరఫున ఏకైక గోల్ చేసింది. శనివారం జరిగే ఆఖరి మ్యాచ్‌లో ఇండియా.. చిలీ లేదా అమెరికాతో తలపడుతుంది.