జూరాలకు లక్ష క్యూసెక్కుల వరద..12 గేట్లు ఓపెన్‌‌ చేసి నీటి విడుదల

జూరాలకు లక్ష క్యూసెక్కుల వరద..12 గేట్లు ఓపెన్‌‌ చేసి నీటి విడుదల

గద్వాల, వెలుగు : జూరాల ఎగువన వర్షాల కారణంగా ప్రాజెక్ట్‌‌కు వరద రాక కొనసాగుతోంది. జూరాలకు 1.05 లక్షల క్యూసెక్కుల ఇన్‌‌ఫ్లో వస్తుండడంతో 12 గేట్లను ఓపెన్‌‌ చేసి 85,268 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే విద్యుత్‌‌ ఉత్పత్తి కోసం 27,532 క్యూసెక్కులు, బీమా లిఫ్ట్- 1కు 650, కోయిల్‌‌సాగర్‌‌కు 315, లెఫ్ట్ కెనాల్‌‌కు 550, రైట్‌‌ కెనాల్‌‌కు 290, ఆర్డీఎస్‌‌ లింక్ కెనాల్‌‌కు 150 క్యూసెక్కులు కలిపి మొత్తం 1,14,649 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.