నా ఓటు నాకు కావాలె.. వేరొళ్లు ఎట్లేస్తరు?

నా ఓటు నాకు కావాలె.. వేరొళ్లు ఎట్లేస్తరు?

చర్లపల్లి: గ్రేటర్ ఎన్నికల్లో పలు చోట్ల ఓట్లు గల్లంతు కావడం, బోగస్ ఓట్లు పడటం లాంటివి వివాదం రేపాయి. చర్లపల్లి డివిజన్ ఎంఆర్ఆర్ హై స్కూల్ పోలింగ్ బూత్ నంబర్-18లో ఒక మహిళ ఓటు వేయడానికి వెళ్లింది. అయితే ఆమె వెళ్లేటప్పటికే ఆ ఓటును మరొకరు వేశారు. దీంతో మహిళ అవాక్కయింది. కుటుంబ సభ్యులతో కలసి ఓటు వేసేందుకు వచ్చిన ఆ మహిళ.. రిటర్నింగ్ ఆఫీసర్‌‌తో గొడవకు దిగింది. తన ఓటును వేసే హక్కు తనకు కల్పించాలని, వేరే వాళ్లు తన ఓటు ఎలా వేస్తారంటూ ప్రశ్నించింది. దీంతో రాద్ధాంతం చేయొద్దంటూ ఆర్‌వో హెచ్చరించారు. తనకు ఎలాగైనా ఓటేసే అవకాశం కల్పించాలని ఆ మహిళ డిమాండ్ చేసింది.

ఇలాంటి మరో ఘటన వనస్థలిపురం డివిజన్‌‌లోని 36వ పోలింగ్ బూత్‌‌లో జరిగింది. తన ఓటును ఎవరో గుర్తు తెలియని వాళ్లు వేశారంటూ సింహాచలం అనే వ్యక్తి ఆరోపించాడు. ఓటు వేయకుండానే తనను పోలింగ్ అధికారులు వెనక్కి పంపారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.