భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డివై చంద్రచూడ్

భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డివై చంద్రచూడ్

సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ నియమితులయ్యారు. సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ నియామకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రీజిజు ట్వీట్ చేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ నవంబర్ 8న పదవీవిరమణ చేయనున్నారు.  నవంబర్ 9న చంద్రచూడ్ బాధ్యతలు స్వీకరిస్తారు. రెండేండ్ల పాటు సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ కొనసాగనున్నారు. 2024 నవంబర్ 10న ఆయన పదవి విరమణ చేయనున్నారు. 

1959 నవంబర్ 11న ముంబైలో జన్మించిన డీవై చంద్రచూడ్. 2016 13న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2000 మార్చి 29న ముంబై హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2013 అక్టోబర్ 31న అలహాబాద్ హైకోర్టు ప్రధానన్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 1998 నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులు అయ్యేంత వరకు అదనపు సొలిసిటర్ జనరల్ గా పనిచేశారు. అమెరికాలోని హార్వర్డ్ లా స్కూల్ లో  LLM డిగ్రీ, జ్యుడీషియల్ సైన్స్ లో డాక్టరేట్ పొందారు. డీవై చంద్రచూడ్ తండ్రి వైవీ చంద్రచూడ్ గతంలో సీజేఐగా పనిచేశారు.