వరల్డ్ కప్ మ్యాచ్ లో పాక్, ఆఫ్ఘన్ అభిమానుల ఫైటింగ్

వరల్డ్ కప్ మ్యాచ్ లో పాక్, ఆఫ్ఘన్ అభిమానుల ఫైటింగ్

ఇంగ్లండ్ లో పాకిస్థాన్ – ఆప్ఘనిస్థాన్ ల మధ్య వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ జరుగుతుండగా.. ఆ రెండు దేశాల అభిమానులు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. లీడ్స్ లోని హెడింగ్లీ స్టేడియంలో ఈ మధ్యాహ్నం పాక్- ఆప్ఘన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ సమయంలో.. “జస్టిస్ ఫర్ బలూచిస్తాన్” , “Help End Disappearences in Pakistan” అని స్లోగన్స్ ఉన్న బ్యానర్లతో ఓ విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. ఈ స్లోగన్స్ తో పాక్, ఆప్ఘన్ అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది. లీడ్స్ పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. ఈ విమానానికి పర్మిషన్ ఎవరిచ్చారనేదానిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.