కాంగ్రెస్ తోనే జలమండలి కార్మికులకు న్యాయం..గత బీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరించలేకపోయింది

కాంగ్రెస్ తోనే జలమండలి కార్మికులకు న్యాయం..గత బీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరించలేకపోయింది

ముషీరాబాద్, వెలుగు: జలమండలి కార్మికుల సమస్యలను గత బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వం పరిష్కరించలేకపోయిందని జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కార్మికుల సమస్యలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. సోమవారం ఐఎన్టీయూసీ సిటీ కార్యాలయంలో బీఆర్‌‌‌‌టీయూ వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇందూరు తిరుపతితో పాటు పలువురు నేతలు యూనియన్‌‌‌‌లో చేరారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ, గత బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం జలమండలి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర రాజ్, అల్లి శ్రావణ్ కుమార్, ఆనంద్ రెడ్డి, రాజిరెడ్డి, రాజు, అశోక్, మోతిరం, మన్సూర్ అలీ పాల్గొన్నారు.