భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జనగణనలో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో మూడు రోజులుగా ఫీల్డ్ ట్రైనర్లకు నిర్వహించిన శిక్షణ శుక్రవారం ముగిసింది. జనగణనపై పాలకోయ తండా ప్రాంతంలో ప్రాక్టికల్ డెమో నిర్వహించారు.
ఈ ప్రోగ్రామ్ను కలెక్టర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వివరాన్ని శ్రద్ధతో నమోదు చేయాలన్నారు. అంతకుముందు కలెక్టరేట్లో నిర్వహించిన దొడ్డి కొమురయ్య జయంతిలో కలెక్టర్ పాల్గొని నివాళులర్పించారు.
