ఫ్రెండ్ భార్యపై లైంగిక దాడికి యత్నం... తన భర్తను మద్యానికి బానిస చేశావని అడిగినందుకు కక్ష

ఫ్రెండ్ భార్యపై లైంగిక దాడికి యత్నం... తన భర్తను మద్యానికి బానిస చేశావని అడిగినందుకు కక్ష
  • భార్యతో వెళ్లి లైంగిక దాడికి యత్నించిన నిందితుడు
  • వారాసిగూడలో కలకలం

పద్మారావునగర్, వెలుగు: ఇంట్లోకి చొరబడి ఓ వివాహితపై లైంగిక దాడికి యత్నించిన ఘటన వారాసిగూడ పరిధిలోని గంగపుత్ర కాలనీలో కలకలం రేపింది. -పోలీసుల వివరాల ప్రకారం.. 29 ఏండ్ల మహిళ తన భర్తతో కలిసి స్థానికంగా నివాసముంటోంది. మోహన్​నగర్​కు చెందిన రాజు అనే వ్యక్తితో బాధితురాలి భర్తకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో ఆయన మద్యానికి బానిసయ్యాడని సమాచారం. ఈ విషయమై బాధితురాలి తల్లి నిలదీయడంతో రాజు కక్ష పెంచుకున్నాడు. 

ఈ నెల 2న తన భార్యతో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లాడు. అక్కడ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సదరు మహిళపై దాడి చేయగా, రాజు ఆమెపై లైంగిక దాడికి యత్నించినట్లు పోలీసులు తెలిపారు. అడ్డుకున్న బాధితురాలి తల్లిని అసభ్యంగా దూషించడంతో పాటు చంపేస్తామని బెదిరించారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వారాసిగూడ పోలీసులు తెలిపారు.