23 రోజుల్లో 3,699 డొమెస్టిక్‌‌‌‌‌‌‌‌ సిలిండర్లు సీజ్ : సివిల్ సప్లైస్ కమిష నర్ స్టీఫెన్ రవీంద్ర

23 రోజుల్లో 3,699  డొమెస్టిక్‌‌‌‌‌‌‌‌ సిలిండర్లు సీజ్ : సివిల్ సప్లైస్ కమిష నర్ స్టీఫెన్ రవీంద్ర
  • 1,275 కేసులు నమోదు చేశాం: సివిల్ ​సప్లైస్​ కమిషనర్ స్టీఫెన్​ రవీంద్ర​

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో అక్రమ ఎల్‌‌‌‌‌‌‌‌పీజీ సిలిండర్ల వినియోగంపై సివిల్‌‌‌‌‌‌‌‌ సప్లై ఆఫీసర్లు దృష్టి సారించారు. మార్చి 12 నుంచి శుక్రవారం వరకు (23 రోజులు) నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 3,699 డొమెస్టిక్‌‌‌‌‌‌‌‌ సిలిండర్లను సీజ్​ చేశారు. మరో 70 చిన్న సిలిండర్లు పట్టుబడ్డాయి. వీటి విలువ రూ.1.10 కోట్లుగా అంచనా వేస్తున్నారు. 1,275 ‘6A’ కేసులు, 216 ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌లు నమోదు చేసినట్లు సివిల్​ సప్లైస్​ కమిషనర్​ స్టీఫెన్​ రవీంద్ర తెలిపారు. 

గృహ వినియోగానికి సంబంధించిన సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లించడం, నిల్వ చేసి బ్లాక్‌‌‌‌‌‌‌‌ లో విక్రయించడం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీలు కొనసాగుతాయని, అక్రమ ఎల్‌‌‌‌‌‌‌‌పీజీ వ్యాపారంపై రాజీ పడబోమని పేర్కొన్నారు.