ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం రెండేళ్ల క్రితం విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ చేయగా, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పాల్గొన్నారు. సోమవారం ప్రభాస్ సెట్‌లో జాయిన్ అయ్యాడు. సమ్మర్ బ్రేక్ తర్వాత ప్రభాస్ ఈ తాజా షెడ్యూల్‌లో పాల్గొంటున్నాడు.
మే 7వరకు జరిగే ఈ షెడ్యూల్ రాత్రి సమయాల్లో జరగనుందని తెలుస్తోంది. అలాగే ఈ షెడ్యూల్‌లో కొత్తగా శింబు కూడా యాడ్ అయ్యాడని సమాచారం. సెకండ్ పార్ట్‌లోని ఇంటర్వెల్ బ్లాక్, యాక్షన్ సీన్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్ చెప్పారు. అలాగే సుప్రీమ్ యాస్కిన్‌గా నటించిన కమల్ హాసన్ పాత్ర నిడివి ఇందులో ఎక్కువ సేపు ఉంటుందని ఇప్పటికే రివీల్ చేశారు.
సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో భారీ అంచనాల మధ్య ఈ చిత్రం తెరకెక్కుతోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఎండింగ్‌లోపు సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టు నుంచి దీపికా పదుకొణెను తప్పించగా, ఆమె ప్లేస్‌లో ఎవరిని రీ ప్లేస్ చేశారో రివీల్ చేయాల్సి ఉంది.
