ఇండియన్ సినిమా దేవుడు.. షారుఖ్పై ఎమోషనల్ ట్వీట్ చేసిన కంగనా

ఇండియన్ సినిమా దేవుడు.. షారుఖ్పై ఎమోషనల్ ట్వీట్ చేసిన కంగనా

బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్(Shah rukh khan) ను సినిమా దేవుడంటూ ప్రస్తావించారు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్(Kangana ranaut).   ఆయన హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ జవాన్(Jawan). సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో రాబడుతోంది జవాన్ మూవీ. తాజాగా జవాన్ సినిమాపై సక్సెస్ పై, హీరో షారుఖ్ ఖాన్ పై స్పందించారు హీరోయిన్ కంగనా రనౌత్. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సుదీర్ఘమైన నైట్ రాసుకొచ్చారు. 

ALSO READ :అదిరిపోయే కామెడీ ఎంటర్టైనర్ తో.. కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ ట్రైలర్ 

తొబైల్లో లవర్ బాయ్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. దాదాపు 40 ఏళ్లుగా అభిమానులను, ప్రేక్షకులను అలరిస్తూ, ఇప్పుడు 60 ఏళ్ళ వయసులో భారతీయ మాస్ సూపర్ హీరోగా ఎదిగిన మీ ప్రయాణం, అందుకోసం మీరు చేసిన పోరాటం ఎందరికో స్ఫూర్తి. నిజ జీవితంలో కూడా మీరు సూపర్ హీరోనే. ఒకానొక సమయంలో జనాలు ఆయన గురించి తప్పుగా మాట్లాడిన, తప్పుగా వ్రాసిన రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. కానీ వాటిని పట్టించుకోకుండా తనను తాను మల్లి ఆవిష్కరించుకోవడానికి చేసిన ఆయన పోరాటం కళాకారులందరికీ మాస్టర్ క్లాస్ లాంటిది. షారుఖ్ కాం ఒక హీరో మాత్రమే కాదు కొన్ని క్లిష్ట పరిస్థితులలో ప్రపంచాన్ని కాపాడ్డానికి వచ్చిన సినిమా దేవుడు.. అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు కంగనా. ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.      

ఇక జవాన్ సినిమా విషయానికి వస్తే.. సెప్టెంబర్ 7న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి అదిరిపోయే టాక్ వచ్చింది. అట్లీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై ముందునుండే భారీ అంచనాలు ఏర్పడగా.. వాటిని అధిగమించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది జవాన్. దీంతో మొదటిరోజు ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక రానున్న రోజుల్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.