అదిరిపోయే కామెడీ ఎంటర్టైనర్ తో.. కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ ట్రైలర్

అదిరిపోయే కామెడీ ఎంటర్టైనర్ తో.. కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ ట్రైలర్

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram), నేహాశెట్టి( Neha Shetty) జంటగా ఆక్సిజన్ ఫేమ్ రత్నం కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం రూల్స్ రంజన్. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అమ్మ పాలిచ్చి పెంచుద్ది..అయ్యా మందిచ్చి ఓదార్చాలా..చెప్పు నాన్నా ఏం తాగుతావ్? అంటూ షురూ అయినా ఈ కామెడీ ఎంటర్ టైనర్ ఆకట్టుకుంటుంది.అలాగే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో హీరో కిరణ్ అబ్బవరం చేసే హంగామా ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది.

ఈ ట్రైలర్‍లో వెన్నెల కిశోర్ కామెడీ, హీరో కిరణ్ అబ్బవరం టైమింగ్, నేహా శెట్టి స్క్రీన్ ప్రజన్స్ మెస్మరైజింగ్ గా ఉన్నాయి. జబర్దస్త్ తో ఫేమస్ అయినా హైపర్ ఆది, వైవా హర్ష డైలాగ్స్ కడుపుబ్బ నవ్వించేలా ఉన్నాయి. హీరో హీరోయిన్ మధ్య సాగే రొమాంటిక్ సీన్స్ ఫ్యాన్స్ యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉండటంతో ఆడియాన్స్లో మంచి క్రేజీ ఏర్పడింది.

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్, లుక్స్, ఫ్యాన్స్ ను వీపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై మంచి క్యూరియాసిటీ పెరిగింది. ఇటీవలే చూసేయ్ చూసేయ్ సాంగ్తో బ్యూటీ నేహా శెట్టి వయ్యారాలు ఒలికించిన తీరుతో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజీ తెచ్చుకుంటోంది. నేహా శెట్టి స్క్రీన్ ప్రసేన్స్ కోసమైనా థియేటర్స్ కి ఆడియన్స్ వస్తారని టాక్ వినిపిస్తోంది.

ALSO READ :ఇండియన్ సినిమా దేవుడు.. షారుఖ్పై ఎమోషనల్ ట్వీట్ చేసిన కంగనా

హీరో కిరణ్ అబ్బవరం ఎస్ ఆర్ కళ్యాణ్ మండపం, సమ్మతమే మూవీస్ తో మంచి హిట్ అందుకున్నారు. ఇక గత చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ ఆడియన్స్ ని డిస్సపాయింట్ చేయడంతో..ఈ మూవీపై కిరణ్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఏం ఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మాతలు.సెప్టెంబర్ 28న రూల్స్ రంజన్ సినిమా థియేటర్లలో విడుదల కానుంది