కూతురి పెండ్లి.. అదే రోజు కొడుకు మృతి

కూతురి పెండ్లి.. అదే రోజు కొడుకు మృతి
  • పెళ్లి ఆగిపోతుందేమోనన్న భయం ఒక వైపు
  • ఎదిగిన కొడుకు శవంలా మారాడన్న బాధ మరో వైపు
  • అప్పగింతలయ్యేదాకా నిజాన్ని దాచిన తండ్రి

పచ్చటి పందిరి. చుట్టపక్కాల సందడి. ఓ అమ్మాయి పెండ్లి ఉన్నం తలో వైభవంగా జరుగుతున్నది. అందరూ కొత్త జంటను చూసి మురి సిపోతున్నరు. కానీ పెళ్లి కూతురు తండ్రి మాత్రం.. గుం డెల్లో అగ్ని పర్వతం దాచుకుని, పైకి చిరునవ్వులు చిం దిస్తూ తిరుగుతున్నాడు. ఓ పక్క కూతురి పెళ్లి జరుగుతుం డగా.. అదే టైంలో కొడుకు యాక్సిడెంట్​లో చనిపోయాడు. పెళ్లి తంతు ముగిసి, అప్పగిం తలయ్యేదాకా ఆ విషయం కడుపులోనే దాచుకున్నాడు. ఈ సంఘటన.. యూపీలోని కాన్పూర్ పరిధి లోని కరియఝలా గ్రామంలో జరిగింది. రామ్ నరేశ్ కూతురు అంజు పెళ్లి బుధవారం జరిగిం ది. ఏవో వస్తువులు తెచ్చేం దుకు వెళ్లిన అతడి కొడుకు హిమాన్షు (18)ఓ ట్రక్కు ఢీకొట్టి చనిపోయాడు. కొడుకు హాస్పిటల్ బెడ్ పై మృతదేహంలా పడున్నాడని తెలిసినా.. ఇంత మంది ఆనందం చెడగొట్టడం ఎందుకనుకున్నాడు. పైగా ఆడపిల్ల తండ్రి కూడా. పెళ్లి వాయిదా వేయడానికి మనసొప్పలేదు. అందుకే.. ఆ విషయం దాచానని స్పృహలో కి వచ్చాక అతడు చెప్పాడు.

Kanpur: Son died, father silent till daughter’s nuptial vows