- మధురానగర్ లో ప్రమాదం
గంగాధర, వెలుగు : ట్రాలీ ఆటోను వ్యాన్ ఢీకొట్టడంతో ఒక మహిళ చనిపోగా, మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం కరీంనగర్జిల్లా గంగాధర మండలం మధురానగర్లో ఆదివారం ఉదయం జరిగింది.
ఎస్సై వంశీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... గంగాధర మండలం మల్లాపూర్గ్రామానికి చెందిన చెల్లోజు వెంకటాచారి తన ట్రాలీ ఆటోలో మంగపేట నుంచి 10 మంది మహిళా కూలీలు లింగాల దేవమ్మ (59), చొప్పదండి శైలజ, నాగెల్లి లక్ష్మి, రాధ, మాధవి, పుల్లెల లక్ష్మి, బైరి నర్సమ్మ, గడ్డమీది స్వరూప, అతికం మమత, బొడ్ల లక్ష్మిని ఎక్కించుకుని పత్తిలో కలుపు తీసేందుకు తీసుకెళ్తున్నాడు.
మధురానగర్చౌరస్తా సమీపంలోకి రాగానే జగిత్యాల నుంచి కరీంనగర్వైపు వెళ్తున్న కోళ్ల వ్యాన్ట్రాలీ ఆటోను ఓవర్టేక్ చేసే క్రమంలో వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ట్రాలీ ఆటో బోల్తాపడి పది మంది కూలీలకు గాయాలయ్యాయి.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన వారిని కరీంనగర్‌లోని ప్రైవేట్హాస్పిటల్కు తరలించారు. అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటూ లింగాల దేవమ్మ చనిపోగా, చొప్పదండి శైలజ పరిస్థితి విషమంగా ఉంది. మిగతా ఎనిమిది మంది స్వల్పగాయాలతో చికిత్స పొందుతున్నారు. మృతురాలు దేవమ్మ భర్త దుర్గయ్య ఫిర్యాదుతో కోళ్ల వ్యాన్ డ్రైవర్పవన్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ప్రమాద విషయం తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కరీంనగర్‌లోని హాస్పిటల్ కు వెళ్లి బాధితులను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ప్రమాద స్థలానికి వెళ్లి బాధితులను కరీంనగర్ హాస్పిటల్కు తరలించడానికి అవసరమైన చర్యలు తీసుకున్నారు.
