కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన కోళ్ల వ్యాన్.. డ్రైవర్ పరారీ

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన కోళ్ల వ్యాన్.. డ్రైవర్ పరారీ

కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం మధుర నగర్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం (ఆగస్ట్ 30) ఉదయం కూలీలతో తిప్పాయపల్లెకు వెళ్తున్న ఆటోను కోళ్ల వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తోన్న ఐదుగురు గాయపడ్డారు. ఇందులో ఓ మహిళా కాలు, చేయి విరిగి తీవ్రంగా గాయపడింది. స్థానికులు అంబులెన్స్‎కు సమాచారం ఇచ్చి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మహిళా చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించింది.

ప్రమాదం అనంతరం క్షతగాత్రులను రోడ్డుపై వదిలేసి కోళ్ల వ్యాన్ డ్రైవర్ పరార్ అయ్యాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. ఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.