మతిమరుపు రాకుండా.. మెదడు షార్ప్‌గా, యంగ్‌గా పనిచేయాలా ? అయితే ఈ సూపర్ ఫుడ్స్ రోజు తింటే సరి!

 మతిమరుపు రాకుండా.. మెదడు షార్ప్‌గా, యంగ్‌గా పనిచేయాలా ?  అయితే ఈ సూపర్ ఫుడ్స్ రోజు తింటే సరి!

మెదడు షార్ప్‌గా, చురుగ్గా పనిచేయాలంటే మనం తినే తిండి చాలా ముఖ్యం. ఎయిమ్స్‌, హార్వర్డ్ వంటి ప్రముఖ సంస్థల్లో శిక్షణ పొందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ (జీర్ణకోశ నిపుణులు) డాక్టర్ మెదడు ఆరోగ్యానికి మేలు చేసే అద్భుతమైన 5 ఆహారాలను సూచించారు. అవేంటో   చూద్దామా.....

వాల్‌నట్‌లు (అక్రోట్లు): వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు కణాలను ఒత్తిడి, వాపుల నుంచి కాపాడి జ్ఞాపకశక్తిని, ఆలోచనా శక్తిని పెంచడానికి సహాయపడతాయి.

గుడ్లు: గుడ్లలో ప్రొటీన్‌తో పాటు 'కోలిన్' అనే పోషకం పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడులో జ్ఞాపకశక్తికి, నేర్చుకోవడానికి అవసరమైన 'ఎసిటైల్‌కోలిన్' అనే రసాయనం తయారవడానికి చాలా అవసరం.

కొవ్వు చేపలు (సాల్మన్ ఫిష్ వంటివి): వీటిలో DHA, EPA రూపంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి. ముఖ్యంగా DHA అనేది మెదడు కణాల నిర్మాణానికి, నరాల పనితీరు మెరుగ్గా ఉండటానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది.

గుమ్మడి గింజలు: వీటిలో మెగ్నీషియం, జింక్, రాగి (కాపర్) ఉంటాయి. జింక్ నరాల మధ్య సంకేతాలు సరిగ్గా అందేలా చూస్తే, మెగ్నీషియం నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేసి మానసిక చురుకుదనం ఉండేలా సహకరిస్తుంది.

ALSO READ : అడవిలో జింక, ఎద్దుల నిజమైన స్నేహం.. ప్రాణం తీయబోయిన నక్క.. 

బెర్రీలు: వీటిలో ఉండే పాలిఫెనాల్స్, ఆంథోసయనిన్లు మెదడులో వాపులను, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతేకాకుండా, వయసు పెరిగే కొద్దీ వచ్చే మతిమరుపు లేదా జ్ఞాపకశక్తి మందగించే సమస్యను ఇవి చాలా వరకు నెమ్మదింపజేస్తాయి.

ఈ ఐదు ఆహారాలను మన ప్రతిరోజు డైట్‌లో చేర్చుకుంటే మెదడు చురుగ్గా మారడంతో పాటు జ్ఞాపకశక్తి, నరాల ఆరోగ్యం కూడా మెరుగవుతాయి.