తిరుమలలో భక్తులకు లగేజి కష్టాలు.. గంటల తరబడి పడిగాపులు

తిరుమలలో భక్తులకు లగేజి కష్టాలు.. గంటల తరబడి పడిగాపులు

తిరుమలలో భక్తులకు లగేజీ కష్టాలు తప్పటం లేదు. తిరుమలకు తొందరగా చేరుకున్నప్పటికీ.. లగేజీ కోసం పడిగాపులు కాయాల్సి రావటం భక్తులను ఆగ్రహానికి గురిచేస్తోంది. 2026 ఆగస్టు 29న లగేజీ సమస్యతో వందలాది భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో కౌంటర్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

దైవ దర్శనానికి వచ్చిన భక్తులు అలిపిరి నుంచి నడకదారిలో తిరుమల చేరుకున్నారు.  లగేజి కోసం గంటల తరబడి కౌంటర్ దగ్గర పడిగాపులు కాస్తున్నారు. అలిపిరి లగేజి కౌంటర్ దగ్గర లగేజి డిపాజిట్ చేసిన భక్తులు..  కాలినడకన తిరుమల చేరుకున్నప్పటికీ..  ఇంకా  లగేజి చేరకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

అటు దర్శనం ఆలస్యమవుతోందని.. లగేజీ ఇప్పటికీ రాకపోవడమేంటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లగేజీ కోసం తిరుమల జీఎన్సీ కౌంటర్ దగ్గర బారులు తీరారు.  లగేజీ ఆలస్యంపై సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.