జీ.వో 97పై స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం జీవో 97 ను రద్దు చేయాలని అన్నారు. 2026 ఆగస్టు 29న ప్రెస్ మీట్ నిర్వహించిన కడియం.. పాలిటెక్నిక్ విద్యార్థులను శక్తి యూనివర్సిటీలో కలపడం సరైంది కాదని అన్నారు.
పాలిటెక్నిక్ విద్యార్థులను టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలోనే ఉంచాలని సూచించారు. మాజీ విద్యా శాఖ మంత్రిగా తనకున్న అనుభవంతో చెప్తున్నానని.. స్కిల్ యూనివర్సిటీలో కలపడం వల్ల ఉపాధి అవకాశాలు కోల్పోయే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఆలోచన మంచిదైనా, విద్యార్థులలో భయం ఉందన్నారు. 97 జీవో రద్దు చేయాలని ప్రభుత్వానికి, ముఖ్యంగా సీఎం రేవంత్ ను కోరుతున్నట్లు చెప్పారు.
