ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన సాంప్రదాయ పాలకుడిగా గిన్నిస్ రికార్డు సృష్టించిన ఉగాండాలోని టూరో రాజ్యపు రాజు ఒయో (Oyo Nyimba Kabamba Iguru Rukidi IV) తన 34 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఈ విషయాన్ని టూరో ప్రధాన మంత్రి అధికారికంగా ప్రకటించారు.
బాల్యంలోనే సింహాసనంపై: కేవలం 3 సంవత్సరాల వయసులోనే 1995లో ఆయన టూరో రాజ్యానికి రాజుగా బాధ్యతలు చేపట్టారు. గిన్నిస్ రికార్డ్స్ ప్రకారం ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన పాలక చక్రవర్తిగా ఆయన గుర్తింపు పొందారు. రెండు మిలియన్లకు పైగా ప్రజలున్న ఈ రాజ్యానికి ఆయన 13వ చక్రవర్తిగా సేవలందించారు.
మరణానికి కారణం: ఆయన మృతికి గల కచ్చితమైన కారణాన్ని రాజకుటుంబం వెల్లడించలేదు. అయితే, ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో అమెరికాలో చికిత్స పొందుతున్నట్లు ఉగాండా ప్రభుత్వ మంత్రి తెలిపారు.
వారసుడు ఎవరు?: రాజుకు ఇంకా అధికారికంగా వివాహం కాలేదు. అయినప్పటికీ రాజరిక కొనసాగింపునకు ఎలాంటి ఇబ్బంది లేదని, సంప్రదాయాల ప్రకారం మహారాజు తన వారసుడిగా ఒక యువరాజును విడిచిపెట్టారని, సరైన సమయంలో ఆయన పేరును ప్రకటిస్తామని ప్రధాని తెలిపారు.
ప్రజల మన్ననలు: ఉగాండాలో రాజకీయ అధికారం లేకపోయినా, సాంప్రదాయ రాజ్యాలకు మంచి గౌరవం ఉంది. కింగ్ ఒయో కేవలం పాలకుడిగా మాత్రమే కాకుండా.. యువత సాధికారత, విద్య, వాతావరణ పరిరక్షణ, హెచ్‌ఐవి/ఎయిడ్స్ అవగాహన వంటి సామాజిక కార్యక్రమాలను ప్రోత్సహించి ప్రజల మన్ననలు పొందారు.
ALSO READ : మతిమరుపు రాకుండా.. మెదడు షార్ప్‌గా, యంగ్‌గా పనిచేయాలా ?
భారీ సంతాపం: రాజు మృతి పట్ల టూరో ప్రజలతో పాటు బుగండా, ర్వెన్జురురు తదితర రాజ్యాలు, ఉగాండా ఫుట్‌బాల్ అసోసియేషన్, పలువురు ప్రముఖులు, పాప్ నటులు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఫుట్‌బాల్ మ్యాచ్‌ల ప్రారంభానికి ముందు ఒక నిమిషం మౌనం పాటించాలని నిర్ణయించారు.
నివాళిగా మొక్కల పెంపకం: రాజుగారికి నివాళిగా సంతాప దినాల్లో పది లక్షల మొక్కలు నాటనున్నట్లు మంత్రి మార్గరెట్ ముహంగా తెలిపారు. ప్రస్తుతం టూరో రాజ్యంలో ఎక్కడ చూసినా విషాద వాతావరణమే అలుముకుంది.
