అంబటి రాంబాబుకు రెండు స్టెంట్లు..

అంబటి రాంబాబుకు రెండు స్టెంట్లు..

అబిడ్స్‌‌‌‌, వెలుగు: వైఎస్సార్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ పార్టీ నేత, ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను హైదర్‌‌‌‌గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. 

శుక్రవారం డాక్టర్లు పరీక్షలు గుండెకు సంబంధించిన సమస్య ఉన్నట్లు గుర్తించారు. దీంతో రెండు స్టెంట్లు వేశారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. 

ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు. మరికొంత సమయం అబ్జర్వేషన్‌‌‌‌లో ఉంచిన అనంతరం సాధారణ గదికి తరలించనున్నట్లు పేర్కొన్నారు.