ఆమ్‌స్టెల్విన్: ఎఫ్‌ఐహెచ్ హాకీ వరల్డ్ కప్‌లో ఇండియా మెన్స్ జట్టు మరోసారి నిరాశపర్చింది. శుక్రవారం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో ఇండియా 3–4 (పెనాల్టీ షూటౌట్) తేడాతో బెల్జియం చేతిలో ఓడి ఎనిమిదో ప్లేస్‌తో సరిపెట్టుకుంది. మ్యాచ్ ఆరంభంలో ఇరుజట్లు హోరాహోరీగా తలపడటంతో రెగ్యులర్ మ్యాచ్ 3–3 స్కోరుతో సమమైంది. హర్మన్‌ప్రీత్ సింగ్ (31, 42, 60వ నిమిషాలు) ఇండియాకు హ్యాట్రిక్ గోల్స్ అందించగా, బెల్జియం ప్లేయర్లు డువెకోట్ రోమన్ (22వ ని), హుగో లాబోచెర్ (23వ ని), నికోలస్ డి కెర్పెల్ (47వ ని) గోల్స్ కొట్టారు.
మ్యాచ్ ఆరంభం నుంచి ఇరుజట్లు గోల్స్ కోసం తీవ్రంగా శ్రమించాయి. అయితే సెకండాఫ్‌లో రెండు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ కొట్టిన జర్మనీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాత హర్మన్‌ప్రీత్ స్కోరు సమం చేసినా చివర్లో ఇండియా డిఫెన్స్ తడబడింది. నాలుగో క్వార్టర్‌లో గోల్ కొట్టిన బెల్జియంకు చివరి నిమిషంలో ఇండియా షాక్ ఇచ్చింది.
హర్మన్‌ప్రీత్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి మ్యాచ్‌ను షూటౌట్‌కు తీసుకెళ్లాడు. షూటౌట్‌లో శీలానంద్ లక్రా, దిల్‌ప్రీత్ సింగ్, అభిషేక్ ఇండియాకు గోల్స్ అందించారు. జర్మనీ తరఫున బూన్ టామ్, ఆర్థర్ డిస్లూవర్, అలెగ్జాండర్ హెండ్రిక్స్, డువెకోట్ రోమన్ గోల్స్ సాధించారు. మరోవైపు విమెన్స్ వరల్డ్ కప్‌లో చారిత్రాత్మక ఐదో ప్లేస్‌ను దక్కించుకున్న ఇండియా జట్టుకు రూ. 50 లక్షల నజరానాను హెచ్‌ఐ ప్రకటించింది.
