పద్మారావునగర్, వెలుగు: ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన సేవా పోటీల్లో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలోని ‘ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్’ ఫస్ట్ ప్రైజ్సాధించింది. తల్లి పాల ప్రాముఖ్యతపై విస్తృతంగా అవగాహన కల్పించడంతో పాటు, తల్లి పాలు అందని నవజాత శిశువులకు పాలను అందిస్తూ ప్రాణాలు నిలుపుతున్నందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఈ అవార్డును అందజేసింది. ఈ గుర్తింపు లభించడంపై డీఎంఈ డాక్టర్వాణి, హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్ సునీల్, డాక్టర్లు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
