సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన నాగబాబు

సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన నాగబాబు

జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సీఎం చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. శుక్రవారం ( ఆగస్టు 28 ) ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ చైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సతీసమేతంగా చంద్రబాబును కలిశారు నాగబాబు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసుకు వెళ్లి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నాగబాబు దంపతులను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు.

మంగళగిరిలో అరణ్య భవన్ లో ఏపీ గ్రీన్ సొసైటీ చైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించారు నాగబాబు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అయన సతీమణితో కలిసి పూజలు నిర్వహించి బాధ్యతలు చేపట్టారు. ఈ పదవికి ప్రభుత్వం క్యాబినెట్ హోదా కల్పించిన సంగతియు తెలిసిందే. 

విజన్ 2047లో భాగంగా రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 50 శాతం అడవులు, చెట్లను పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ఏపీ గ్రీన్ కార్యక్రమం. ఇందులో భాగంగా నాగబాబుకు కీలక బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం.