రూ.22 వేల కోట్ల లోన్.. 6.25 కోట్లకు సెటిల్మెంట్..జీ గ్రూప్ ఫౌండర్ సుభాష్‌‌‌‌ చంద్రకు ఎన్‌‌సీఎల్‌‌టీ బంపర్ ఆఫర్‌‌‌‌

రూ.22 వేల కోట్ల లోన్.. 6.25 కోట్లకు సెటిల్మెంట్..జీ గ్రూప్ ఫౌండర్ సుభాష్‌‌‌‌ చంద్రకు ఎన్‌‌సీఎల్‌‌టీ బంపర్ ఆఫర్‌‌‌‌
  • రూ.22 వేల కోట్ల లోన్.. 6.25 కోట్లకు సెటిల్​మెంట్​ 
  •    జీ గ్రూప్ ఫౌండర్ సుభాష్‌‌‌‌ చంద్రకు ఎన్‌‌సీఎల్‌‌టీ బంపర్ ఆఫర్‌‌‌‌
  •     బ్యాంకులకు మాత్రం భారీ నష్టం
  •     ఎన్‌‌సీలాట్‌‌కు హెచ్‌‌డీఎఫ్‌‌సీ?  

న్యూఢిల్లీ:  జీ గ్రూప్‌ ఫౌండర్‌‌‌‌ సుభాష్ చంద్రకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌‌‌‌సీఎల్‌‌‌‌టీ) బంపర్ ఆఫర్ ఇచ్చింది. మొత్తం రూ.22 వేల కోట్ల మొండిబాకీలు ఉంటే కేవలం రూ.6.25 కోట్లు చెల్లించి బయటపడేందుకు ఆయనకు అవకాశం ఇచ్చింది. బ్యాంకులు జీ గ్రూప్‌ (ఎస్సెల్‌‌ గ్రూప్‌‌) సబ్సిడరీలకు ఇచ్చిన అప్పులో ఇది  కేవలం 0.028 శాతమే!  అంటే బ్యాంకులు 99.98 శాతం మేర నష్ట పోవాల్సిందే. ఎన్‌‌సీఎల్‌‌టీ ఆమోదించిన రీపేమెంట్ ప్లాన్‌‌‌‌పై నేషనల్ కంపెనీ లా అప్పిలెట్ ట్రిబ్యునల్ (ఎన్‌‌‌‌సీలాట్‌‌‌‌) కు వెళ్లాలని   హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్ చూస్తోంది.   

అప్పు తీసుకోలే.. గ్యారెంటర్‌‌‌‌గా ఉన్నాడంతే

  ఈ రూ.22,006 కోట్ల బకాయిలు సుభాష్ చంద్ర స్వయంగా తీసుకున్నవి కావు. ఎస్సెల్ గ్రూప్‌‌‌‌లోని వివిధ కంపెనీలు (ఇన్‌‌‌‌ఫ్రా, మీడియా, పవర్ ప్రాజెక్టులు) తీసుకున్న రుణాలకు ఆయన కేవలం పర్సనల్ గ్యారెంటర్‌‌‌‌‌‌‌‌గా  సంతకం చేశారు. ఆ కంపెనీలు నష్టపోయి రుణాలను ఎగ్గొట్టినప్పుడు, ఆ మొత్తం బాధ్యత గ్యారంటర్‌‌‌‌గా ఉన్న సుభాష్​పై పడింది. రిజల్యూషన్ ప్రొఫెషన్ (ఆర్‌‌‌‌పీ) లెక్కల ప్రకారం, సుభాష్ వ్యక్తిగత ఆస్తి విలువ రూ.6.25 కోట్ల కంటే తక్కువగా ఉంది.  తన వద్ద అందుబాటులో ఉన్న ప్రతి పైసాను (ఆస్తులు, డిపాజిట్లు అమ్మి) రూ.6.25 కోట్ల రీపేమెంట్‌‌కు ఆఫర్ చేశానని, వ్యక్తిగతంగా ఇంతకంటే ఎక్కువ చెల్లించలేనని ఆయన వాదించారు.   ఈ ప్లాన్‌‌‌‌కు 80.81శాతం ఓటింగ్ షేర్ ఉన్న సంస్థలు అనుకూలంగా ఓటు వేశాయి. హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ, యాక్సిస్, ఎల్‌‌‌‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ వంటి బ్యాంకులు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, వాటి ఓటింగ్ వాటా 20శాతం లోపే ఉండటంతో ప్లాన్ ఆమోదం పొందింది. మరోవైపు  అప్పలు తీసుకున్న అసలు కంపెనీల నుంచి రికవరీ చేసుకునే హక్కు బ్యాంకులకు చట్టపరంగా ఇంకా  ఉంది. కానీ, మొత్తం అప్పులో 10 శాతం వసూలు కావడం కూడా కష్టమని ఎనలిస్టులు చెబుతున్నారు.

ఇదేనేమో న్యాయం అంటే: మాల్యా

ఎన్‌‌సీఎల్‌‌టీ సుభాష్ చంద్రకు రిలీఫ్ ఇవ్వడంపై ఆర్థిక మోసగాడు విజయ్‌‌ మాల్యా స్పందిచారు. "ఇదే నిజమైతే నా మిత్రుడు సుభాష్‌‌కు శుభాకాంక్షలు. నాపై ఉన్న రూ.6,203 కోట్ల అప్పుకు బదులుగా బ్యాంకులు, ప్రభుత్వం రూ.14,100 కోట్లను రికవరీ చేశాయి.  కానీ చాలామంది స్వల్ప మొత్తాలకే సెటిల్ చేసుకుంటున్నారు. భారత్‌‌లో ఇదేనేమో న్యాయం అంటే! మీడియా కూడా ప్రశ్నించడం లేదు" అని  మాల్యా  ఎక్స్‌‌లో పేర్కొన్నారు.