న్యూయార్క్: చెక్ స్టార్ ప్లేయర్లు కరోలినా ముచోవా–జాకుబ్ మెన్సిక్.. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మిక్స్‌డ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. గురువారం జరిగిన ఫైనల్లో అన్‌సీడెడ్ ముచోవా–మెన్సిక్ 6–3, 1–6 (10/6)తో నాలుగో సీడ్ బెలిండా బెన్సిక్ (స్విట్జర్లాండ్)–ఫ్లావియో కోబలి (ఇటలీ)పై గెలిచారు. గంటా 13 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో మెన్సిక్ శక్తివంతమైన సర్వ్‌లతో పాటు, నెట్ దగ్గర అద్భుతంగా ఆడాడు. తొలి సెట్‌లో తేలిపోయిన స్విస్–ఇటలీ ద్వయం రెండో సెట్‌లో బలంగా పుంజుకున్నారు. అయితే టైబ్రేక్‌లో మెన్సిక్ సర్వీస్‌ల ముందు నిలవలేకపోయారు. మెన్సిక్ బలమైన ఏస్‌తో మ్యాచ్‌ను ముగించి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. చాంపియన్లుగా నిలిచిన ముచోవా–మెన్సిక్ జోడీకి దాదాపు రూ. 9.55 కోట్ల ప్రైజ్‌మనీ లభించింది.
