ప్రముఖ మసాలల తయారీ కంపెనీ ఎవరెస్ట్ ఫుడ్ ప్రాడక్ట్స్ కు FSSAI షాకిచ్చింది. తప్పుడు బ్రాండింగ్,నాణ్యత లేని ఇంగువ, మూడు రకాలమసాలాలు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా తయారు చేస్తున్నట్లు గుర్తించి ఎవరెస్ట్‌కు నోటీసులిచ్చింది. ఎవరెస్ట్ హింగ్ ప్రాడక్ట్ తప్పుడు బ్రాండింగ్‌తో, నాణ్యత లేదని తేలడంతో దాని అమ్మకాలను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) తాత్కాలికంగా నిషేధించింది. దీంతోపాటు లాల్జీ గోధుమ హింగ్ అమ్మకాలను కూడా నిషేధించడంతో పాటు నోటీలిచ్చారు.
ఎవరెస్ట్ తయారు చేస్తున్న ఎగ్ కర్రీ మసాలా, చికెన్ మసాలా ,గరం మసాలాలలో కూడా నిబంధనల ఉల్లంఘనను FSSAI గుర్తించింది. ఈ ప్యాకెట్లలో 5 శాతం కంటే ఎక్కువగా ఉప్పు ఉందని, మసాలా దినుసుల కంటెంట్ స్ఫష్టంగా లేదని వెల్లడించారు.మసాలాలలో మొత్తంలో స్టార్చ్ ఉన్నట్లు తేలడంతో, ఆ బ్రాండ్ విక్రయాలపైనా నిషేధం విధించారు. అయినప్పటికీ, ఈ మూడు ఉత్పత్తులను నిషేధించలేదు.
ఈ ప్యాకెట్లపై 5శాతం కంటే ఎక్కువ ఉప్పు (Salt) శాతం వివరాలను, మసాలా దినుసుల అసలు కంటెంట్‌ను స్పష్టంగా ప్రకటించలేదని అధికారులు గుర్తించారు. మరో కంపెనీపై కూడా చర్యలు చేపట్టారు.ఎవరెస్ట్‌తో పాటు దేశంలోనే నవంబర్ బ్రాండ్ ప్రముఖ ఇంగువ బ్రాండ్ లాల్జీ గోధూ అండ్ కంపెనీ ఇంగువ శాంపిల్స్ లో కూడా నాణ్యత లోపం ఉందని గుర్తించారు. ఎక్కువ మొత్తంలో స్టార్చ్ ఉన్నట్లు తేలడంతో, ఆ బ్రాండ్ విక్రయాలపైనా నిషేధం విధించారు. ప్యాక్ చేసిన ఆహార పదార్థాల కోసం ప్యాక్ ముందు భాగంలో కొత్త వార్నింగ్ లేబుల్‌ను ప్రతిపాదించినట్లు FSSAI సుప్రీం కోర్టుకు తెలిపిన క్రమంలో ఈ చర్య తీసుకున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించే వరకు నిషేధం కొనసాగుతుందని హెచ్చరించింది. భవిష్యత్తులో నిబంధనలు పాటించేలా ,లోపాలను సరిదిద్దేలా ఓ ప్రణాళిక రూపొందించి సమర్పించాలని FSSAI ఈ కంపెనీలను ఆదేశించింది.
