Irumudi Box Office: పాత లెక్కలన్నీ సరి చేసిన రవితేజ.. రూ. 150 కోట్ల క్లబ్‌లో 'ఇరుముడి'!

 Irumudi Box Office: పాత లెక్కలన్నీ సరి చేసిన రవితేజ.. రూ. 150 కోట్ల క్లబ్‌లో 'ఇరుముడి'!

వరుస పరాజయాలతో సతమతమవుతున్న టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజకు ఎట్టకేలకు ఒక సాలిడ్ ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్ లభించింది. డెలికేట్ ఎమోషన్స్, మాస్ యాక్షన్‌ను మేళవించి దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన 'ఇరుముడి' చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. భారీ అంచనాల మధ్య ఆగస్టు 21, 2026న థియేటర్లలో విడుదలైంది. తొలి షో నుంచే ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

విడుదలై రెండో వారాంతంలోకి  'ఇరుముడి' ప్రవేశించినప్పటికీ.. థియేటర్ల వద్ద ప్రేక్షకుల తాకిడి, రిపీట్ ఆడియన్స్ హంగామా అసలు తగ్గడం లేదు.  మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా, వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రూ. 150 కోట్ల గ్రాస్ మార్కును అధిగమించి కొత్త రికార్డులను తిరగరాసింది. రవితేజ కెరీర్‌లోనే ఇది అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరిన బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 

పోటీగా వచ్చిన భారీ చిత్రాలు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో..  'ఇరుముడి' మూవీకి మల్టీప్లెక్స్‌లతో పాటు నైజాంలోని ప్రధాన సింగిల్ స్క్రీన్స్ రూట్ క్లియర్ అయి షోల సంఖ్య భారీగా పెరిగింది.  2022లో వచ్చిన 'ధమాకా' తర్వాత రవితేజ ఖాతాలో వంద కోట్ల సినిమా పడలేదు. ఈ నాలుగేళ్లలో ఆయన నటించిన ప్రాజెక్ట్‌లు నిరాశపరచడంతో ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.

 కానీ ఇప్పుడు 'ఇరుముడి'లో రవితేజ, బేబీ నక్షత్రల మధ్య సాగే తండ్రీకూతుళ్ల భావోద్వేగాలు, ప్రియా భవానీ శంకర్ నటన , జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన హృదయాలను హత్తుకునే సంగీతం సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. ప్రస్తుతం ఉన్న ఊపు చూస్తుంటే అతిత్వరలోనే ఈ చిత్రం రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. మాస్ రాజా ఈ రేంజ్ కంబ్యాక్‌తో పాత లెక్కలన్నీ ఒక్కసారిగా సరిచేశారు.