ఆగిన మరో రైతు గుండె

ఆగిన మరో రైతు గుండె

ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యంతో మరో రైతు గుండె ఆగిపోయింది. ఇప్పటికే ఐదుగురు రైతులు వడ్ల కుప్పల దగ్గరే ప్రాణాలు విడిచారు. ఇవాళ మరో రైతు.. కొనుగోలు కేంద్రం దగ్గర బస్తాల్లో వడ్లు నింపుతూ గుండెపోటు వచ్చి చనిపోయాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఆబాది జమ్మికుంటకు చెందిన బిట్ల ఐలయ్య రైతు గుండెపోటుతో మృతి చెందాడు. 15 రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చాడు రైతు. ఇవాళ ధాన్యం అమ్ముతున్న క్రమంలో సంచుల్లో ధాన్యం నింపుతుండగా గుండె పోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని చెబతున్నారు బంధువులు.