రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్ వార్.. కార్లతో గుద్దుకున్నరు.. పొట్టుపొట్టు కొట్టుకున్నరు.. వీడియో వైరల్

రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్ వార్.. కార్లతో గుద్దుకున్నరు.. పొట్టుపొట్టు కొట్టుకున్నరు.. వీడియో వైరల్

కర్ణాటకలో రెండు గ్రూపుల మధ్య జరిగిన గ్యాంగ్ వార్ కలకలం రేపింది.కర్ణాటకలోని కుంజుబొట్టు ప్రాంతంలో గ్యాంగులకు చెందిన వ్యక్తులు కార్లతో ఢీకొంటూ.. కత్తులు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ వార్ ఓ సామాజిక వర్గానికి చెందిన రెండు గ్రూపుల మధ్య మే 18న ఉడిపి, మనిపాల్ నేషనల్ హైవేపై జరిగింది. గ్యాంగ్ వార్ కు సంబంధించిన సీసీఫుటేజ్ బయటికి రావడంతో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆందోళన చర్చకు దారి తీసింది. 

ఈ వీడియాలో హైవైపై రెండు షిఫ్ట్ కార్లతో ఢీకొట్టుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. తర్వాత కొందరు వ్యక్తులు కార్లనుంచి దిగి ప్రత్యర్థులపై దాడులు చేస్తున్నట్లు ఈ ఫుటేజ్ లో కనిపిస్తుంది. ఒక వ్యక్తిని కారుతో ఢీకొట్టిన భయంకరమైన సీన్స్ కూడా కనిపించాయి. 

ఈ వీడియోలు చూసిన వెంటనే కర్ణాటక పోలీసులు రంగంలోకి దిగి ఈ ఘర్షణకు సంబంధం పలువురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అరెస్టయిన నిందితులకు జూన్ 1 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఇదే రెండు గ్యాంగులు గతంలో కూడా ఘర్షణకు దిగినట్టు ఉడిపి ఎస్పీ అరున్ కుమార్ తెలిపారు. వీరిపై మే 20న కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 

రాష్ట్రంలో నేరాలు పెరుగుతున్నాయి.. బీజేపీ విమర్శలు 

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో బీజేపీ నేతల కంట పడింది. దీంతో కాంగ్రెస్ పాలనపై విమర్శలకు దిగారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో నేరులు పెరిగిపోతున్నాయంటూ ఆరోపిస్తున్నారు.  గ్యాంగ్ వార్ లు, యువతులపై అత్యాచారాలు, దాడులు, హత్యలు, బాంబు పేలుళ్లు, గంజాయి, నల్లమందు, రేవ్ పార్టీలు , పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు వంటి కాంగ్రెస్ పాలనలో సాధారణం అయిపోయాయంటూ కర్ణాటక బీజేపీ.. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం ఉగ్రవాదులు, మతోన్మాదులు, దుండగులు, దుర్మార్గులకు స్వేచ్ఛనిచ్చి పోలీసులను కీలు బొమ్మగా మార్చుకుందని ఈ పోస్టులో ఆరోపించారు. ఇదంతా కాంగ్రెస్ కర్ణాటక మోడల్ అని బీజేపీ ఆరోపిస్తోంది.