పాస్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం 'స్పిరిట్' . సందీప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. లేటెస్ట్ ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఒకటి నెట్టింట్ హల్ చల్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా భాగం కానుందనే ప్రచారం జోరుగా సాగుతోంది . ఇప్పుడు ఈ వార్త అభిమానుల్లో మరింత జోష్ ను నింపుతోంది.
ఇప్పటికే ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్‌కు జోడీగా త్రిప్తి డిమ్రి నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం కత్రినా కైఫ్‌ను హీరోయిన్ పాత్ర కోసం కాకుండా.. కథలో అత్యంత కీలకమైన, సినిమాకు బలమైన మలుపు తీసుకొచ్చే పాత్ర కోసం సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై చిత్రబృందం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్‌గా మారింది.
ఇదే నిజమైతే ప్రభాస్, కత్రినా కైఫ్ తొలిసారి ఒకే తెరపై కనిపించనున్నారనే ఉత్సాహం అభిమానుల్లో నెలకొంది. గతంలో టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత కూడా దక్షిణాది నుంచి ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ కత్రినా ఎక్కువగా బాలీవుడ్‌కే పరిమితమయ్యారు. అలాంటి ఇప్పుడు 'స్పిరిట్' వంటి పాన్ ఇండియా సినిమాలో కనిపిస్తే అది ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉంది.
ఇటీవల ఒక కార్యక్రమంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. 'స్పిరిట్' మూవీ చిత్రీకరణ దాదాపు 40 శాతం పూర్తయిందని వెల్లడించారు. ఈ చిత్రంలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. భారీ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ డ్రామా, ఇంటెన్స్ కథనం ప్రేక్షకులను అలరించనున్నాయి.. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తక్కువ షూటింగ్ రోజులలో పూర్తి చేసి.. 2027 మార్చిలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి కత్రినా ఎంట్రీపై అధికారిక ప్రకటన వస్తుందా లేదా అన్న ఆసక్తి ఇప్పుడు అభిమానుల్లో రోజురోజుకీ మరింత పెరుగుతోంది...
