Gen Z యువతే లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన ముందుకెళ్తుంది: కవిత 

Gen Z యువతే లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన ముందుకెళ్తుంది: కవిత 

Gen Z యువతే లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన ముందుకెళ్తుందని అన్నారు టీఆర్ఎస్ అధినేత్రి కవిత. శనివారం ( మే 2 ) మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు కవిత. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఉచిత విద్య అందించాలని చూస్తున్నామని... ప్రజలందరికీ ఉచిత విద్య అందిస్తామని అన్నారు. ఎన్ని లక్షలు ఖర్చైనా అందరికీ ఉచిత వైద్యం అందిస్తామని అన్నారు కవిత. తెలంగాణాలో ప్రశ్నించే గొంతుగా మారతామని.. తెలంగాణ జాగృతి ఎన్జీవోగా మారుతుందని అన్నారు.

రాష్ట్రంలో జరిగే అన్యాయాలపై పోరాటం చేస్తామని..అందరి జీవితాల్లో వెలుగు కోసం పోరాడతామని అన్నారు కవిత. సర్వోదయ తెలంగాణ కోసం అడుగులు వేస్తున్నామని..పాంచజన్యం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నామని అన్నారు. జెన్ జీ యువతే లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన ముందుకెళ్తుందని..18ఏళ్ళ నుంచి 25ఏళ్లలోపు యువతకు ప్రత్యేకంగా ఆర్థిక సాయం అందిస్తామని అన్నారు. ప్రభుత్వ శ్రద్ధ పెడితే 25ఏళ్ళ లోపు యువతను లక్షాధికారులు చేయచ్చని అన్నారు.

తెలంగాణ రక్షణ సేన అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తుందని.. మహిళలు ఉద్యోగాలు చేయడం మాత్రమే కాకుండా వంద మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని అన్నారు. తాను అమ్మగా పరిణితి చెందుతానని అంటే అవాకులు చవాకులు పేలుతున్నారని... ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వాల్లో అమ్మతనం లోపించింది కాబట్టే తాను అమ్మగా మారతానని అంటున్నానని అన్నారు కవిత.