జూబ్లీహిల్స్, వెలుగు: బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్‌లో శనివారం ఉదయం వాకింగ్ ట్రాక్ దాటుతున్న సుమారు 20 అడుగుల కొండచిలువను చూసి వాకింగ్చేసేందుకు వచ్చినవారు ఉలిక్కిపడ్డారు. కొందరు భయంతో పరుగులు తీయగా, మరికొందరు ఆసక్తిగా తమ ఫోన్లలో వీడియోలు, ఫొటోలు తీసుకున్నారు. అవి సోషల్‌మీడియాలో వైరల్అయ్యాయి. కొండచిలువ పొదల్లోకి వెళ్లిపోవడంతో అక్కడున్నవారు ఊపిరి పీల్చుకున్నారు.
