కవిత పార్టీతో  కేసీఆర్కే నష్టం.. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే

కవిత పార్టీతో  కేసీఆర్కే నష్టం.. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే
  • 10న సికింద్రాబాద్​లో ప్రధాని మోదీ సభ
  •     నిజామాబాద్ ఎంపీ అర్వింద్

కామారెడ్డి, వెలుగు: తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్​ అన్నారు.  శనివారం కామారెడ్డి జిల్లా బీజేపీ నాయకులతో పార్టీ ఆఫీసులో సమావేశం నిర్వహించారు. ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్​గ్రౌండ్స్​లో నిర్వహించే ప్రధాని నరేంద్ర మోదీ సభపై చర్చించారు. అర్వింద్ మాట్లాడుతూ.. ఇటీవల ఎన్నికలు జరిగిన 5 స్టేట్స్​లో బీజేపీ గెలువనుందని ధీమా వ్యక్తం చేశారు. పరేడ్​ గ్రౌండ్స్​లో జరిగే సభ తెలంగాణలో 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు నాంది కాబోతోందన్నారు.

ప్రధాని మోదీ రూ.8వేల కోట్ల అభివృద్ధి పనులకు శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు చెప్పారు. కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన పార్టీతో బీజేపీకి ఎలాంటి నష్టం లేదని, కేసీఆర్​కు మాత్రమే నష్టం జరుగుతుందన్నారు.

కేసీఆర్, కేటీఆర్​అవినీతిని కవిత బయటపెడుతున్నారని అన్నారు.  సమావేశంలో పార్టీ జిల్లా ప్రెసిడెంట్ నీలం చిన్నరాజులు, మాజీ ఎమ్మెల్యే అరుణతార, జిల్లా జనరల్ సెక్రటరీలు రవీందర్​రావు, నరేందర్​రెడ్డి, నాయకులు  పాల్గొన్నారు.