గంజాయి సాగు చేస్తే.. రైతుబంధు,భీమా కట్

గంజాయి సాగు చేస్తే.. రైతుబంధు,భీమా కట్

అటవీ భూములు కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం కేసీఆర్. వచ్చే నెల 8 నుంచి పోడు సాగుకు క్లెయిమ్స్ తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యలు, అటవీ పరిరక్షణపై  ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం. అటవీ భూముల రక్షణ అంశాలపై జిల్లాల్లో అఖిల పక్ష సమావేశాలు నిర్వహించాలని సూచించారు. నవంబర్ 8లోగా వివిధ స్థాయిలో సన్నాహాక సమావేశాలు ఏర్పాటు చేసి..R-O-F-R చట్టం ప్రకారం గ్రామ కమిటీలు చేపట్టాలన్నారు. గంజాయి సాగు చేస్తే.. రైతుబంధు, భీమా కట్ చేయడంతో పాటు జైలుకు పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. గుడుంబా తయారీని పూర్తిస్థాయిలో అరికట్టి.. తయారీదారులకు ఉపాధి, పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.