ఏనుగు పైనాపిల్‌ తినుండకపోవచ్చు: ఫారెస్ట్‌ అధికారులు

ఏనుగు పైనాపిల్‌ తినుండకపోవచ్చు: ఫారెస్ట్‌ అధికారులు
  • బెల్లంపూత పూసిన బాంబు తినిందని అనుమానం
  •  ఘటనకు సంబంధించి ఒకరు అరెస్ట్‌
  • కొనసాగుతున్న విచారణ

తిరువనంతపురం: దేశమంతటా చర్చకు దారితీసిన కేరళలోని ఏనుగు ఘటనలో పోలీసులు ఒక రైతు కూలీని అరెస్టు చేశారు. ఏనుగును పొలం దగ్గర చివరిసారి చూసింది అతనే అని, ఘటనపై విచారణ జరుపుతున్నామని ఫారెస్ట్‌ అధికారులు చెప్పారు. ఆ గజరాజు పైనాపిల్‌ కాకుండా ఎలుగు బంట్ల కోసం బెల్లం పూత పూసిన బాంబును తిన్నట్లు అనుమానాలు ఉన్నాయన్నారు. డిటైల్‌ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ వస్తే తప్పా దీనిపై ఒక క్లారిటీ రాదని వైల్డ్‌ లైఫ్‌ చీఫ్‌ వార్డెన్‌ సురేంద్రన్‌ కుమార్‌‌ అన్నారు. పైనాపిల్‌ తినిందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. బాంబు ఏనుగు నోట్లో పేలిందని, దవడ భాగం మొత్తం ఇరిగిపోయిందని పోస్ట్‌ మార్టం రిపోర్ట్‌లో తేలిందని అన్నారు. పైనాపిలా లేకుంటే బెల్లంపూత తినిందా అనే దానిపై డిటైల్డ్‌ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుందని చెప్పారు. కేరళలోని చాలా పొలాల్లో ఎలుగుబంట్లు రాకుండా రైతులు బాంబులకు బెల్లం పూత పూసి పొలాల్లో పెడతారు. ఒక్కోసారి ఏనుగులు కూడా వాటిని తింటాయని, దాని వల్ల ప్రమాదాలు జరుగుతాయని ఫారెస్ట్‌ అధికారి ఒకరు చెప్పారు. అలా ఎలుగుల కోసం పెట్టడం కూడా చట్టరిత్యా నేరం అని అన్నారు. అందుకే కేసు నమోదు చేసి ఆ దిశగా విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. కేరళ మలప్పురం దగ్గర్లోని ఓ గ్రామంలో కొంత మంది ఆకతాయిలు అత్యంత క్రూరమైన చర్యకు పాల్పడ్డారు. గర్భంతో ఉన్న ఏనుగుకు పైనాపిల్‌లో పటాకులు పెట్టి తినటానికి ఇచ్చారు. దాన్ని తిన గజరాజుకు నాలికకు దెబ్బలు తగిలాయి. నొపపి తట్టుకోలేక రిలీఫ్‌ కోసం నదిలోకి దిగింది. రోజుల తరబడి అక్కడే ఉండిపోయి.. కన్నుమూసింది.