పేరుకే పార్ట్ టైం.. చేసేది ఫుల్ టైమ్..కేజీబీవీ కంప్యూటర్ ఇన్ స్ట్రక్టర్ల ఆందోళన

పేరుకే పార్ట్ టైం.. చేసేది ఫుల్ టైమ్..కేజీబీవీ కంప్యూటర్ ఇన్ స్ట్రక్టర్ల ఆందోళన

హైదరాబాద్, వెలుగు: కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేస్తున్న కంప్యూటర్ ఇన్​స్ట్రక్టర్ల పరిస్థితి అయోమయంలో పడింది. శుక్రవారం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్‌‌‌‌‌‌‌‌ను ఇన్ స్ర్టక్టర్ల సంఘం ప్రతినిధులు బి.సరిత, జ్యోతి, సావిత్రి తదితరులు సహా పలువురు కలిసి వినతిపత్రం అందించారు. తాము కేవలం విద్యార్థులకు పాఠాలు చెప్పడానికే పరిమితం కావడం లేదని, స్కూల్.. కాలేజీలకు సంబంధించిన పూర్తి స్థాయి డేటా ఎంట్రీ, కంప్యూటర్ ఆపరేటర్ పనులన్నీ తమతోనే చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రోజంతా స్కూళ్లలోనే పనిచేయిస్తూ నెలకు కేవలం రూ. 7,800 జీతం మాత్రమే ఇవ్వడం దారుణమని మండిపడ్డారు. పెరిగిన ధరల కాలంలో ఈ అరకొర జీతంతో కుటుంబాన్ని ఎలా పోషించాలని ప్రశ్నించారు. ఆదివారాలు, పండుగ సెలవులు, చివరకు వేసవి సెలవుల్లో కూడా తమతో పనిచేయిస్తున్నారని వాపోయారు. గత 15 ఏండ్లుగా పనిచేస్తున్న తమను కాదని, ఇప్పుడు ఐసీటీ ప్రాజెక్టు కింద తమ స్థానంలో కొత్తవారిని తీసుకురావడం సరికాదన్నారు. ఇప్పటికైనా తమను సీఆర్టీ కంప్యూటర్ ఇన్​స్ట్రక్టర్లుగా గుర్తించి, మినిమం బేసిక్ పే చెల్లించాలని
 డిమాండ్ చేశారు