బాలయ్య సినిమాలో ఛాన్స్ కొట్టేసిన కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి

బాలయ్య సినిమాలో ఛాన్స్ కొట్టేసిన కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి

కేజీఎఫ్(KGF) బ్యూటీ శ్రీనిధి శెట్టి(Srinidhi shetty) బంపర్ ఆఫర్ కొట్తసింది. టాలీవుడ్ ఎంట్రీ కోసం సిద్ధమవుతోంది. కేజీఎఫ్ లో తన అందం, అభినయంతో ఆడియన్స్ మనసులు గెలుచుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అది కూడా నందమూరి నటసింహం బాలకృష్ణతో. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేస్తున్న బాలకృష్ణ.. ఈ సినిమా తరువాత డైరెక్టర్ బాబీతో సినిమా చేయడానికి ఓకే చెప్పేశాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది ఏ సినిమా. NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శ్రీనిధి శెట్టిని ఫిక్స్ చేశారట మేకర్స్.

ALSO READ: లీకైన గుంటూరు కారం సాంగ్.. షాకైన ఫ్యాన్స్

కేజిఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ లో నటించిన ఈ బ్యూటీకి ఆ తరువాత సరైన హిట్ పడలేదు. ఇప్పుడు మరోసారి అలాంటి అవకాశం దక్కింది శ్రీనిధికి. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మరి ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోని శ్రీనిధి మల్లి ఫామ్ లోకి వస్తుందా అనేది చూడాలి మరి.