లీకైన గుంటూరు కారం సాంగ్.. షాకైన ఫ్యాన్స్

లీకైన గుంటూరు కారం సాంగ్.. షాకైన ఫ్యాన్స్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu), త్రివిక్రమ్(Trivikram) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur kaaram). హారిక అండ్ హాసిని క్రియేషన్స్(Harika hasini creations) పై చినబాబు(Chinababu), సూర్యదేవర నాగవంశీ(Suryadevara nagavanshi) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో.. శ్రీలీల(Sreeleela), మీనాక్షి చౌదరి(Meenakshi chaudary) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చాలా రోజుల తరువాత ,మహేష్ బాబు నుండి వస్తున్న పక్కా మాస్ అండ్ కమర్షియల్ సినిమా కావడంతో.. ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమా నుండి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది.

ALSO READ: తల్లి కల నెరవేర్చిన జబర్దస్త్ ఫైమా.. మిలమిలా మెరిసిపోతున్న కొత్త ఇల్లు

తాజాగా ఈ మూవీ నుండి సాంగ్ లీక్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సగానికి పైగా లీకైన ఈ పాటలో.. తమన్ మాస్ బీట్ అదిరిపోయిందని, లిరిక్స్ కూడా మహేష్ బాబుకు పర్ఫెక్ట్ గా సరిపోయే స్టార్.. సూపర్ స్టార్ అంటూ ఉండడంతో.. పాత నెక్స్ట్ లెవల్లో ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అయితే.. ఈ పాత గుంటూరు కారం సినిమాలోనిది కాదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ పాట ఏ సినిమాలోనిదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.