తల్లి కల నెరవేర్చిన జబర్దస్త్ ఫైమా.. మిలమిలా మెరిసిపోతున్న కొత్త ఇల్లు

తల్లి కల నెరవేర్చిన జబర్దస్త్ ఫైమా.. మిలమిలా మెరిసిపోతున్న కొత్త ఇల్లు

జబర్దస్త్(Jabardasth) కామెడీ షోతో ఫెమస్ ఐన లేడీ కమెడియన్ ఫైమా(Faima). పటాస్(Patas) షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె.. తనదైన టైమింగ్ తో తక్కువ టైంలోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఆ గుర్తింపుతోనే బిగ్ బాస్ లో కూడా అడుగుపెట్టింది. హౌస్ లో 10 వారాల పాటు ఆడియన్స్ కు అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ పంచింది. ఈ షోలో భాగంగా తన తల్లి కోరికను బయటపెట్టిన ఫైమా.. తాజాగా ఆ కలను నెరవేర్చింది. తన తల్లి కల మరేదో కాదు సొంత ఇల్లు. ఇప్పుడు ఆ కలను నెరవేర్చి కొత్త ఇంట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసి.. తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. అంతేకాదు త్వరలోనే జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లుగా కూడా ఈ వీడియోలో చెప్పుకొచ్చింది ఫైమా. 

ALSO READ: Good Health : స్పూన్లతో వద్దు.. చక్కగా చేతితో తినండి.. ఎంత ఆరోగ్యమో తెలుసా..!

ఇక ఫైమా కొత్త ఇంటి విషయానికి వస్తే.. ఇంటి ఇంటీరియల్ డిజైనింగ్ నెక్స్ట్ లెవల్లో ఉంది. తాజాగా జరిగిన ఆ ఇంటి గృహ ప్రవేశానికి..  
జబర్దస్త్ కమేడియన్ బుల్లెట్ భాస్కర్ తో పాటు మరికొంతమంది సెలబ్రిటీలు వచ్చి.. ఫైమాకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక తన తల్లి కోరికను నెరవేర్చిన ఫైమాకు ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ రూపంలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ ఫైమా ఇంటికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.