కొరియాలో తమిళ యువతి
షెన్బా (ప్రియాంక మోహన్) తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో పెరుగుతుంది. ఆమెకు చిన్నప్పటినుంచి కొరియన్ సంస్కృతి, కె– డ్రామాలు, కె– పాప్ మీద ఆసక్తి ఉండేది. స్కూల్‌లో జరిగిన ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్‌లో ఆమె తమిళనాడులో పుట్టి, పెరిగి కొరియాకు రాణి అయిన హ్యూవాంగ్– ఓక్ పాత్ర పోషిస్తుంది. అప్పటినుంచి కొరియా మీద ఇష్టం మరింత పెరుగుతుంది. ఇంటర్నెట్ సిగ్నల్ కోసం ఏనుగు మీద ఎక్కి మరీ కె– -డ్రామాలు చూసేది.
ఇంట్లో పెండ్లి సంబంధాలు చూస్తుండడంతో తన ప్రేమికుడు మణి (రిషికాంత్)తో కలిసి దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు వెళ్లేందుకు ప్లాన్ వేస్తుంది. కానీ.. మణి ఆమెను మోసం చేసి వెళ్లిపోతాడు. దాంతో ఒంటరిగా సియోల్‌కు చేరుకుంటుంది. అక్కడ భాషా అడ్డంకులు, ఒంటరితనం, మోసాలు.. ఇలా ఎన్నో ఎదురవుతాయి. చివరకు ఒక వ్లాగర్ సాయంతో బెడ్‌రిడెన్ అయిన పెద్దావిడ (పార్క్ హ్యే–జిన్)కు కేర్‌టేకర్‌గా పనిలో చేరుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆమె తిరిగి ఇండియాకు వచ్చిందా? లేదా? అనేది మిగతా కథ.
రెండు కథలు.. ఒకే ముగింపు!
చారులత (రైనా రాధాకృష్ణన్) స్వతంత్రంగా బతకాలి అనుకునే అమ్మాయి. వాళ్ల ఊళ్లోనే ఉండే కుమార్ (దినేష్) ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. కానీ..పెండ్లి చేసుకోనని ముందే చెప్పేస్తాడు. దాంతో ఆమె కుమార్ లవ్‌ను రిజెక్ట్ చేస్తుంది. ఈ విషయం బయటికి తెలియడంతో ఆమెపై కొందరు దుష్ప్రచారం చేస్తుంటారు.
మరోవైపు అదే ఊళ్లో ఒక డాల్మేషియన్ డాగ్ సుట్టు (టోవినో థామస్ వాయిస్)తన యజమాని తల్లిని కరిచిందని పుకార్లు పుడతాయి. దాంతో గ్రామస్తులు దానికి రేబిస్ ఉందని అనుమానిస్తారు. ఒక గ్యాంగ్ సుట్టును ఎలాగైనా పట్టుకోవాలని వెతుకుతూ ఉంటుంది.
ఈ రెండు ట్రాక్‌లు పారలల్‌గా సాగుతుంటాయి. చివరికి రెండూ కలిసి గ్రామంలోని హింసను, మహిళలపై ఉన్న వివక్షను బయటపెడతాయి. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ.
టైటిల్ : పెన్నుం పోరాటుం
ప్లాట్ ఫాం : నెట్‌ఫ్లిక్స్
డైరెక్షన్ : రాజేష్ మాధవన్
కాస్ట్ : రైనా రాధాకృష్ణన్, దినేష్, సుభాష్ చంద్రన్, షానూజ్ అలనల్లూర్, సతీష్ పులిక్
యాడ్స్ కోసం..
ఒకప్పుడు ఎంతో ప్రసిద్ధి చెందిన వార పత్రిక ‘నమ్మ సేధి’ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో పడి మూసివేయడానికి రెడీగా ఉంది. డిజిటల్ మీడియా పోటీ, తగ్గుతున్న రీడర్షిప్, యాడ్ రెవెన్యూ లేకపోవడం వల్ల దాని ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి టైంలో నలుగురు ఫ్రెండ్స్ వీరా (రిషికాంత్), అళగు సుందరం(అబ్దుల్ లీ), వల్లి (అద్వితా అరుముగం), ముత్తు (మౌరిష్ దాస్) ఆ పత్రికను నిలబెట్టడానికి బలంగా ప్రయత్నిస్తారు. అది వీరా తాత ఆసిరియార్ చెల్లదురై (చిన్ని జయంత్) స్థాపించిన పత్రిక కావడంతో ఎలాగైనా దాని లెగసీని కాపాడాలి అనుకుంటాడు. అందరూ కలిసి పత్రికకు యాడ్స్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెడతారు. చివరికి పత్రికను కాపాడుకున్నారా? లేదా? అనేది మిగతా కథ.
టైటిల్ : లోకల్ టైమ్స్
ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో
డైరెక్షన్ : నవీన్ జార్జ్ థామస్
కాస్ట్ : రిషికాంత్, అబ్దుల్ లీ, మౌరీష్ దాస్, అద్విత అరుముగం, పాండియరాజన్, చిన్ని జయంత్, రిని, నందిత శ్రీకుమార్
