ఏం చేస్కుంటవో చేస్కో పో !...ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్లో స్టాఫ్దురుసు ప్రవర్తన

ఏం చేస్కుంటవో చేస్కో పో  !...ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్లో స్టాఫ్దురుసు ప్రవర్తన
  •     మందుల కోసం వచ్చిన    ఫ్యామిలీపై దాడికి యత్నం  

హైదరాబాద్ సిటీ, వెలుగు : ఖైరతాబాద్ వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్​సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మందుల కోసం వచ్చిన ఓ కుటుంబంపై సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంతా ఆ కుటుంబంపై పడడంతో లిఫ్ట్​లో వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా అందులోకీ వెళ్లి వాగ్వాదానికి దిగారు. వివరాల్లోకి వెళ్తే..మంగళవారం ఉద్యోగులు, జర్నలిస్టులు, రిటైర్డ్​ఎంప్లాయీస్​కోసం ఏర్పాటు చేసిన ఖైరతాబాద్ వెల్​నెస్​సెంటర్​కు ఓ రిటైర్డ్ ఎంప్లాయ్ కొడుకు మందుల కోసం ఫోన్​చేశాడు. ఎన్నిసార్లు కాల్​చేసిన లిఫ్ట్​ చేయకపోవడంతో తన భార్య, తల్లితో కలిసి సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చాడు. 

రిసిప్షన్ దగ్గరకు వెళ్లి తాను తన తల్లి కోసం ప్రతినెలా తీసుకునే మందుల కోసం ఫోన్​ చేస్తే ఎందుకు లిఫ్ట్​చేయలేదని అడిగాడు. అక్కడున్న సిబ్బంది ‘ఫోన్ పని చేయదు. ఏం చేస్కుంటారో చేస్కోండి..ఎక్కడైనా కంప్లయింట్​చేస్కోండి’ అని బదులివ్వడంతో ఆ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ఫోన్​ చాలా రోజులుగా పని చేయడం లేదని తెలుసుకుని, బాధ్యత లేకుండా పని చేస్తున్నారని అనడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. దీన్ని చూసిన మిగతా సిబ్బంది కూడా అక్కడికి చేరుకుని సదరు కుటుంబంతో గొడవపడ్డారు. 

చివరకు అందరూ కలిసి ఆ ఫ్యామిలీపై దాడికి యత్నించారు. భయపడి వారు లిఫ్ట్​లో వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. అయినా, ఇద్దరు మేల్​ స్టాఫ్ ​లిఫ్ట్​లోకి దూసుకువెళ్లి వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడున్న వాళ్లు ఆ సిబ్బందిని లిఫ్ట్​నుంచి బయటకు లాగి ఆ కుటుంబాన్ని పంపించివేశారు. బాధితులు మాట్లాడుతూ ‘ప్రతి నెలా మేం మందుల కోసం వస్తుంటాం. ఉన్నాయో లేవో కనుక్కోవడానికి కాల్​చేస్తే లిఫ్ట్​ చేయలేదు.. అడిగితే నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడమే కాకుండా దాడికి ప్రయత్నించారు.. ఇద్దరం మహిళలం ఉన్నా కొట్టడానికి మీద మీదకు వచ్చారు’ అని చెప్పారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ గొడవతో అక్కడకు వచ్చిన ఇతర పేషంట్లు భయభ్రాంతులకు గురయ్యారు.