హైదరాబాద్ సిటీ, వెలుగు: చాదర్‌ఘాట్‌ఆజాద్ మార్కెట్‌లోని ఇద్దరు చికెన్ షాపుల యజమానులపై ఖైరతాబాద్ జోన్ వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ మంగళవారం నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 22న మేయర్ విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీ చేపట్టినప్పుడు షాపుల్లో అపరిశుభ్రత నెలకొనడం, ఎలుకలు తిరుగుతున్నాయని గమనించి సీజీ చేయమని ఆదేశించారు. సీజ్చేసేందుకు వెళ్లిన అధికారులను ఓ ఎమ్మెల్సీ, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు బెదిరించారు. తాజాగా మేయర్ ఆదేశాలతో వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
