జ్యోతిష్య శాస్త్రం గ్రహాల కదలిక చాలా ముఖ్యమైనది. కొన్ని సార్లు గ్రహాల కదలికలో మార్పులు శుభ యోగాలని, అశుభ యోగాలని తీసుకొస్తూ ఉంటాయి. ఒక్కో సారి గ్రహాలు ఉదయించడం, అస్తమించడం కూడా చేస్తాయి. మే 11న ఉదయం 4:30కి కుజుడు మేషరాశిలోకి మారనున్నాడు. అదే రాశిలో 45 రోజుల పాటు సంచరించనున్నాడు. దీని వలన కొన్ని రాశుల వారు సానుకూల మార్పుల్ని, కొత్త అవకాశాలని పొందబోతున్నారు. ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. . .!
మేష రాశి: ఈ రాశి వారు ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ఉన్నతాధికారుల నుంచి అవార్డులు అందుకుంటారు. ఎప్పటి నుంచో పూర్తి కాలేకపోయిన టాస్కులను ఈ సమయంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెడితే ఆశించిన లాభాలు కలుగుతాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది . ఆరోగ్యం మెరుగు పడుతుంది. . కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కష్టానికి తగ్గ ఫలితాన్ని చూస్తారు. సానుకూల మార్పులు ఉంటాయి.
తులా రాశి: ఈ రాశి వారికి ఇది శుభ సమయమని పండితులు చెబుతున్నారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా జరుగుతుతాయి. ఆర్థిక పరంగా బాగుంటుంది. ఎప్పటి నుంచో ఉన్న ఆర్థిక సమస్యల నుంచి సులువుగా బయట పడతారు. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. సంతోషం కూడా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు. పూర్వీకుల ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి పాత గొడవలు, సమస్యలు తొలగిపోతాయి. ప్రశాంతంగా ఉంటారు. సానుకూల మార్పులు చూస్తారు. ఆదాయం కూడా పెరుగుతుంది.సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవ హారాలు సానుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతాయి. ప్రమోషన్ తో పాటు కొద్దిపాటిగా వేతనం పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

