V6 News

లుంగి ఎంగిడీ సేఫ్.. త్వరలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్.. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే..

లుంగి ఎంగిడీ సేఫ్.. త్వరలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్.. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే..

పంజాబ్తో జరిగిన మ్యాచ్లో క్యాచ్ పట్టుకునేందుకు యత్నించి తీవ్రంగా గాయపడిన ఢిల్లీ ఆటగాడు లుంగి ఎంగిడీ ఆరోగ్యంపై ఢిల్లీ జట్టు కీలక ప్రకటన చేసింది. ఎంగిడీ ఆరోగ్యం నిలకడగా ఉందని.. త్వరలోనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతాడని ఢిల్లీ జట్టు ‘ఎక్స్’లో ట్వీట్ చేసింది. దీంతో.. ఐపీఎల్ అభిమానులకు ఊరట లభించింది.

ప్రమాదం ఏం లేనప్పటికీ ఎంగిడీ పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. గాయం తీవ్రతను పరిశీలిస్తే.. ఈ ఐపీఎల్ సీజన్కు ఎంగిడీ దాదాపు దూరమైన పరిస్థితులే ఉన్నాయి. ఢిల్లీ బౌలింగ్ విభాగానికి ఎంగిడీ దూరమైతే పెద్ద దెబ్బ తగలడం ఖాయం అని చెప్పక తప్పదు.

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మిడ్-ఆఫ్ నుంచి వెనక్కి వస్తూ క్యాచ్ పట్టే ప్రయత్నంలో లుంగి ఎంగిడి తలకు తీవ్ర గాయం కావడంతో కుప్పకూలిపోయాడు. అప్పటిదాకా సందడిగా ఉన్న స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది.

పాపం ఎంగిడీ ఎంత తీవ్రంగా గాయపడ్డాడంటే.. అతని కింద పడి తిరగబడటంతో అతని శరీరం బరువు మొత్తం మెడపై.. మరీ ముఖ్యంగా తలపై పడింది. దీంతో.. మెడ మీద నరాలపై బాగా ఒత్తిడి పడింది. తల లోపల తీవ్ర గాయమైంది. లుంగీ ఎంగిడీని స్టేడియం నుంచి ఆసుపత్రికి అంబులెన్స్లో తరలించారు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన గంటన్నర తర్వాత.. ఆ పేసర్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.