తెలంగాణలో తొలిసారి జనాభా లెక్కలు నిర్వహించేందుకు సర్వం సిద్దమయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా జనాభా లెక్కల షెడ్యూల్ ను ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోళికేరి. జనగణన మొత్తం రెండు దశల్లో జరగనుంది. మొదటి దశలో ఆన్ లైన్ లో డిటెయిల్స్ నమోదు(సెల్ఫ్ ఎన్యూమరేషన్), ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరణలో భాగంగా బడి,గుడి,ఆస్పత్రి,గుడిసె , అద్దె ఇల్లు ఇలా ఇండ్ల గణన, రెండో దశలో వ్యక్తిగత సమాచారం సేకరించనున్నారు.
మొదటి దశ జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా ఏప్రిల్ 26, 2026 నుంచి మే 9 వరకు సొంతంగా ఆన్ లైన్ లో డీటెయిల్స్ నమోదు (సెల్ఫ్ ఎన్యూమరేషన్) ఉంటుంది. ఆ తర్వాత మే 11నుంచి జూన్ 9 వరకు ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరిస్తారు. తుదిదశలో ఫిబ్రవరి 9, 2027 నుంచి ఫిబ్రవరి 28, 2027 వరకు జనగణన జరుగునుంది. మన వివరాలు చెప్పేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్ ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదు.

►ALSO READ | చిన్న మొత్తంలో గంజాయి ఉంటే అరెస్ట్ చేయొద్దు..అది ఓ మెడిసిన్ గా అమెరికా ఎందుకు గుర్తించింది.?
తొలిదశ జనాభా లెక్కల ప్రక్రియలో 33 ప్రశ్నలకు జవాబులు సేకరిస్తారు. జనాభా లెక్కల సేకరణ పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుందని, ఎక్కడా పెన్నూ కాగితం వాడరని చెప్పారు భారతి హోళీకేరి చెప్పారు. ఎన్యూమరేటర్లు స్మార్ట్ ఫోన్‌లోని మొబైల్ యాప్ ద్వారా కుటుంబాల సమాచారాన్ని నమోదు చేసుకుంటారు. ప్రజలు తమ వివరాలను స్వయంగా సమర్పించేందుకు ఉద్దేశించిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ హిందీ, ఇంగ్లీషు సహా 16 భాషల్లో లభ్యమవుతుంది. మొబైల్ నంబర్, ఇతర మౌలిక వివరాలను పోర్టల్‌లో పేర్కొన్న తర్వాత ప్రతి కుటుంబానికి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీ లభిస్తుంది. ఎన్యూమరేటర్ క్షేత్ర పర్యటనకు వచ్చినపుడు ఆ ఐడీ సమర్పించాల్సి ఉంటుంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్‌కు 15 రోజులు కేటాయించగా తర్వాత నెల రోజులు ప్రత్యక్షంగా ఇంటింటి వివరాల సేకరణ జరుగుతుంది.
జనగణ కు సంబంధించి ఎలాంటి సమాచారం కోసమైనా 1855 హెల్ప్ లైన్ నెంబర్ 10am to 6pm అందుబాటులో సంప్రదించవచ్చు.