V6 News

పాంచజన్యం పేరుతో ఐదు హామీలు..పార్టీ ఆవిర్భావ సభలో కల్వకుంట్ల కవిత ప్రకటన

పాంచజన్యం పేరుతో ఐదు హామీలు..పార్టీ ఆవిర్భావ సభలో కల్వకుంట్ల కవిత ప్రకటన

తెలంగాణ రాష్ట్రసేన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత పార్టీ ఆవిర్బావ సభలో పాంచజన్యం పేరుతో ఐదు హామీలను ప్రకటించారు. విద్యా, వైద్యం, వ్యవసాయం, ఉపాధి,సామాజిక తెలంగాణ అంశాలపై హామీలను నెరవేరుస్తామని చెప్పారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఉచితంగా అందరికీ విద్యా, వైద్యం అందిస్తామన్నారు. ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తామన్నారు. రైతే రాజు అన్న నినాదాన్ని  నిజం చేసేలా రైతుల అభివృద్దికి పాటుపడతామన్నారు. యువత ఉపాధికోసం రూ. 2లక్షల నుంచి రూ. 20కోట్ల వరకు రుణాలిస్తామన్నారు. సామాజిక తెలంగాణ సాధనకు తెలంగాణ రాష్ట్ర సేన కృషి చేస్తుందన్నారు కవిత. 

మొదటి హామీలో ఉచిత విద్య అందిస్తామన్నారు కవిత. ఉచిత విద్యలో భాగంగా ప్రైవేట్ స్కూళ్ళలో అందరికీ ఉచిత అందిస్తామన్నారు. రెండో హామీగా అందరికీ ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించారు.  ఎలాంటి రోగమైన సరే ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం అందిస్తామన్నారు. 

మూడో హామీగా రైతు సంక్షేమమే పార్టీ ధ్యేయంగా పనిచేస్తుందన్నారు కవిత. రైతే రాజు  అన్న నినాదాన్ని  నిజం చేస్తామన్నారు. ఇక నాలుగో హామీగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. ఉపాధికల్పనలో భాగంగా  రూ. 2లక్షల నుంచి రూ. 20 కోట్ల వరకు యువతకు రుణాలిస్తామన్నారు. ఐదో హామీగా సామాజిక తెలంగాణ సాధనకు కృషి చేస్తామన్నారు.