భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 154.
విభాగాల వారీగా ఖాళీలు: ప్రాసెస్ టెక్నీషియన్ (కెమికల్) 60, ప్రాసెస్ ఆపరేటర్/ ఆపరేటర్ (కెమికల్) 64, టెక్నీషియన్/ ఆపరేటర్ (మెకానికల్) 13, టెక్నీషియన్ (ఎలక్ట్రికల్) 17.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కెమికల్ ఇంజినీరింగ్/ కెమికల్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్( ఇండస్ట్రియల్ కంట్రోల్)లో డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. డిప్లొమాలో జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 60 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలు 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జులై 29.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ. 590, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
లాస్ట్ డేట్: ఆగస్టు 13.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్: సెప్టెంబర్.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్/ ప్రొఫిషియెన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ bharatpetroleum.inను సందర్శించండి.
