కృష్ణుడు పుట్టిన రోజే బెయిల్ కావాలా: బోబ్డే

కృష్ణుడు పుట్టిన రోజే బెయిల్ కావాలా: బోబ్డే

ఓ కేసు తీర్పు సంద‌ర్భంగా జోక్ చేశారు సుప్రీం కోర్టులో చీఫ్ జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డే. కృష్ణుడు జైలులో ఈ రోజే పుట్టాడు కదా అప్పుడే నీకు బెయిల్ కావాలా అంటూ కాసేపు అందరినీ న‌వ్వించారు.  మ‌హారాష్ట్ర‌కు చెందిన ధ‌ర్మేంద్ర వాల్వే ఓ మ‌ర్డ‌ర్ కేసులో జైలుశిక్ష‌ను అనుభ‌విస్తున్నాడు. అయితే అత‌ను పెట్టుకున్న బెయిల్ పిటిష‌న్ అభ్య‌ర్థ‌న‌ను సీజే(మంగళవారం) విచారించారు.  ధ‌ర్మేంద్ర‌కు బెయిల్ ఇవ్వాలంటూ పిటిష‌న‌ర్ త‌ర‌పున లాయర్ కోరారు. ఆ స‌మ‌యంలో చీఫ్ జ‌స్టిస్ మాట్లాడుతూ…. శ్రీకృష్ణ భ‌గ‌వానుడు ఇవాళే జైలులో పుట్టార‌ని…నీకు జైలు విడిచి బెయిల్ పై వెళ్లాల‌ని ఉందా అంటూ జోక్ చేశారు. అపుడు  పిటిష‌న‌ర్ త‌ర‌పున న్యాయ‌వాది త‌మ‌కు బెయిల్ కావాలంటూ అభ్య‌ర్థించారు. మంచిది నీకు మ‌త‌ప‌ర‌మైన ప‌ట్టింపులు లేవ‌న‌ట్లుగా సీజీ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీ స‌భ్యుడైన ధ‌ర్మేంద్ర వాల్వేతో పాటు అయిదు మంది పార్టీ కార్య‌క‌ర్త‌ల‌పై మ‌ర్డ‌ర్ కేసు న‌మోదు అయ్యింది. 1994లో బీజేపీ అభ్య‌ర్థిని హ‌త‌మార్చిన కేసులో వాళ్లు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ట్ర‌య‌ల్ కోర్టు వారిని ఆ కేసులో దోషులుగా తేల్చింది.  హైకోర్టు తీర్పుకు వ్య‌తిరేకంగా సుప్రీంలో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.  ఆ కేసును విచారించిన సీజే.. 25వేల పూచీక‌త్తుపై ధ‌ర్మేంద్ర‌కు బెయిల్ మంజూరు చేశారు.