మూడు గంటల్లో హంతకుడు అరెస్ట్ ..డబ్బుల విషయంలో ఇద్దరి వ్యక్తుల మధ్య గొడవ

మూడు గంటల్లో హంతకుడు అరెస్ట్ ..డబ్బుల విషయంలో ఇద్దరి వ్యక్తుల మధ్య గొడవ

కూకట్​పల్లి, వెలుగు: హత్య జరిగిన మూడు గంటల్లోనే కూకట్​పల్లి పోలీసులు హత్య కేసులో నిందితుడిని పట్టుకున్నారు. యూపీకి చెందిన జంషెద్​అహ్మద్​(54), బీహార్​కు చెందిన ముకేష్​కుమార్​ఝూ(34) ప్రశాంత్​నగర్​లోని ట్రాన్స్​ఫార్మర్​ కంపెనీలో పని చేస్తున్నారు. ఇద్దరూ రాజీవ్​గాంధీనగర్​లో ఒకే గదిలో ఉంటున్నారు. 

డబ్బుల విషయంలో వీరిద్దరి మధ్య చిన్న చిన్న లావాదేవీలున్నాయి. మంగళవారం రాత్రి ఇద్దరూ కలిసి తమ గదిలోనే మద్యం తాగారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో మాటా మాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో ఆగ్రహానికి గురైన జంషెద్​అహ్మద్​ కిచెన్​లోని కత్తి తీసుకుని ముకుశ్​కుమార్​ ఛాతీపై పొడిచి హత్య చేసి పరారయ్యాడు. రాత్రి పదిన్నరకు మర్డర్​జరగ్గా స్థానికుల సమాచారం, సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితుడిని మూడు గంటల్లోనే పట్టుకోగలిగారు. బుధవారం నిందితుడిని రిమాండ్​కు తరలించారు.